Tuesday, 12 June 2012
ఇండియా అయినా లండన్ అయినా అమెరికా అయినా ఆడది ఆడదే
అవును ఏ దేశమయిన ఆడదాన్ని చులకన గానే చూస్తారు అందరు.ఆడది చదువుకున్నా ఉద్యోగం
చేసినా ,ఇంట్లో అన్ని పనులు చేసి పిల్లల్ల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి మంచి బుద్దులు చెప్పినా చివరికి మగాడి చేతుల్లో బొమ్మ లానే వుండాలి.
మగాడు మగాడే.నిజంగా దేవుడు మగవాడే కాబట్టి మగవాడికి అంత హక్కు ఇచ్చాడ.
ఎందుకు మగాడు చెప్పిందే ఆడది వినాలి.ఎందుకు?
ఎందుకు కార్యేషు దాసీ కరణేషు మంత్రి అంది ఆడడానికి మాత్రమే ఈ వాక్యాలు.
మగాడి ఎలాంటి నీతి సూత్రాలు లేవా.
మగడు తిట్టినా కొట్టిన ఎందుకు పడి వుండాలి.ఇంట్లో అమ్మ వాళ్ళకు చెప్పుకోలేదు ఆడది.అత్తా మామ కు చెప్పుకోలేదు.ఎందుకు ప్రతి బాద ఆడదే బరించాలి.
ఇంత సాఫ్ట్వేర్ అభివృద్ధి అయింది.ఇంత ప్రపంచం ముందుకు పోతుంది.అయినా మగడు మాత్రం నా బార్య నేను చెప్పినట్టే వినాలి.అనే సూత్రం మాత్రం ఇంకా పోవట్లేదు.
బార్య కూడా ఒక ఆడదే.ఒక తల్లి కన్నా బిడ్డ.అని మగడు ఎందుకు అనుకోడు.ఒక చిన్న చూపు వుంటుంది ఎందుకు.
ఇదంతా నేను ఇంత సడన్ గ ఎందుకు రాస్తున్నాను అంటే మొన్న ఒక స్నేహితురాలి కథ విన్నాను.బయటకి ఎంత సంతోషం గ కనిపిస్తున్న ఆమె వెనుక ఎంత బాద దాగి వుంది అన్న నిజం తెలిసాక మనసు ఎంతో బాధగా అనిపించింది.కని ఆమె ఆ నిజాన్ని అలానే ఉంచుతుంది,ఎందుకంటే తన బిడ్డ ఈ లోకం కోసం.అన్ని బరిస్తూ వుంటుంది.
Subscribe to:
Post Comments (Atom)


7 comments:
మీకు జరిగిందా?
తప్పు చేసిన వాడిని శిక్షించండి కానీ అందరూ ఇదే చేస్తున్నారు అంటే ఎలాగ?
hi priya memu eastlondonlo vuntamu.weeke
nd antha varshaelega ekkadiki velledi
ఫణింద్ర గారు నేను నాకు జరిగింది అని చెప్పలేదు.
ఈ సమాజం లో ఇలా వుంది అని అంటున్నాను.
నేను అందరు ఇదే చేస్తున్నారు అని అనట్లేదు.బట్ చాలా మంది మగవాళ్ళు ఇలా చేస్తున్నారు అంటున్నాను.ఎవరో కొద్ది మంది భార్య ని అపురూపంగా చూసుకుంటారు.
భార్య అంటే ఒక మనిషి అని ఆమెని ప్రేమ గ చూసుకోవాలని మగవాళ్ళు తెలుసుకోవాలి.
అంతే కాని భార్య అంటే భరించేది కాబటి కొట్టాలి తిట్టాలి అని ఉండకూడదు.
ఒక మాట ప్రేమ గ మాట్లాడితే అంతే చాలు అనుకుంటుంది ఆడది.అది తెలుసుకుంటే చాలు
keep changing, bhartha ante bharinchuvadu anukuntanandi,
అన్నపూర్ణమ్మగారి కి ఒక అమ్మాయి, అబ్బాయి. . ఇద్దరు అమెరికా లో ఉంటున్నారు.
అన్నపూర్ణ గారు ఇలా తన పక్కింటామెతో చెపుతున్నారు." మా అమ్మాయి చాలా బాగుందండి. అన్ని పనులు కలిసి చేసుకుంటారు భార్యా భర్తలు ఇద్దరు. మా అల్లుడు వంట కూడా బాగా చేస్తాడు. ఎదో లెండి..అమ్మాయి దూరం గా ఉందన్నమాటే కాని, సుఖం గానే ఉందండి! అబ్బయికే పాపం సుఖం లేదు.పొద్దున్ననగా ఉద్యోగానికి వెళతాడా..ఇంటికి రాగానే, మళ్ళీ అన్ని పనులు చెయ్యాల్సొస్తుంది.కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది కాని పెద్ద సంపాదన కాదు అబ్బయితో పోలిస్తే..అయినా ఇంటి పనులు తను చేసుకుంటే నామోషి ఆ చెప్పండి? ఎంటో వాడి మీదే బెంగ!!"
ఏమర్ధమయ్యింది మీకు? ఈ మాటలు అన్నపూర్ణమ్మ వి కాని వారి భర్త వి కాదు. ఆయన అంటుంటాడు, కొడుకు, కోడలు వాళ్ళకి ఇష్టమైనట్టు వారు ఉంటారు..మధ్య నీకెందుకో బాధ అని. తల్లి ఎలా పెంచుతుందో, ఏవి చెప్పి పెంచుతుందో, పిల్లలు అవే నేర్చుకుంటారు. మగవారు స్త్రీ ల పట్ల చూపే వైఖరికి చాలమటుకు వారి తల్లి కారణం అవుతుంది..అంటే స్త్రీల కష్టాలకు కారణం చాలా మటుకు స్త్రీలే అన్నమాట! (May be 70% of the cases!)
బాగా చెప్పారు ... ఆడదానికి ఆడదే శత్రువు .. అయినా ఈ రోజుల్లో గయ్యాలి అత్తలు , గయ్యాలి భార్యలే ఎక్కువ .. వారి విషయాలు మీడియాలో రావు .. కనీసం బాధితులు చెప్పుకోడానికి కూడా ఇష్టపడరు..
క్షమించండి భర్త అంటే నే భరించేవాడు.భార్య కాదు.కానీ నేను కావాలనే రాసాను.ఎందుకంటే ఆ వాక్యం మారింది కాబట్టి.ఎప్పుడు కూడా భార్య నే భరిస్తుంది కాబట్టి.ఏదైనా అనవచు భార్య ని ఆమె పడి వుంటుంది అని భర్త అనేవాడికి ఒక పొగరు నమ్మకం.
జలతారువెన్నెల గారు చాల బాగా చెప్పారు అంది.కరెక్ట్ గ చెప్పారు.ఆడదానికి ఆడదే శత్రువు.అత్త కూడా ఆడదే అన్న విషయం మరచి పోతుంది.కొడుకు మాత్రమే తన బిడ్డ.కోడలు ఒకరు కన్న బిడ్డ అని ఆలోచించదు.
ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా అత్త అత్తే.ఆమె ఎప్పటికి మారదు.కోడల్ని చులకనగా చూడటం ఆమెకు ఇష్టం.అంతే అది.
Post a Comment