Tuesday, 12 June 2012
ఇండియా అయినా లండన్ అయినా అమెరికా అయినా ఆడది ఆడదే
అవును ఏ దేశమయిన ఆడదాన్ని చులకన గానే చూస్తారు అందరు.ఆడది చదువుకున్నా ఉద్యోగం
చేసినా ,ఇంట్లో అన్ని పనులు చేసి పిల్లల్ల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి మంచి బుద్దులు చెప్పినా చివరికి మగాడి చేతుల్లో బొమ్మ లానే వుండాలి.
మగాడు మగాడే.నిజంగా దేవుడు మగవాడే కాబట్టి మగవాడికి అంత హక్కు ఇచ్చాడ.
ఎందుకు మగాడు చెప్పిందే ఆడది వినాలి.ఎందుకు?
ఎందుకు కార్యేషు దాసీ కరణేషు మంత్రి అంది ఆడడానికి మాత్రమే ఈ వాక్యాలు.
మగాడి ఎలాంటి నీతి సూత్రాలు లేవా.
మగడు తిట్టినా కొట్టిన ఎందుకు పడి వుండాలి.ఇంట్లో అమ్మ వాళ్ళకు చెప్పుకోలేదు ఆడది.అత్తా మామ కు చెప్పుకోలేదు.ఎందుకు ప్రతి బాద ఆడదే బరించాలి.
ఇంత సాఫ్ట్వేర్ అభివృద్ధి అయింది.ఇంత ప్రపంచం ముందుకు పోతుంది.అయినా మగడు మాత్రం నా బార్య నేను చెప్పినట్టే వినాలి.అనే సూత్రం మాత్రం ఇంకా పోవట్లేదు.
బార్య కూడా ఒక ఆడదే.ఒక తల్లి కన్నా బిడ్డ.అని మగడు ఎందుకు అనుకోడు.ఒక చిన్న చూపు వుంటుంది ఎందుకు.
ఇదంతా నేను ఇంత సడన్ గ ఎందుకు రాస్తున్నాను అంటే మొన్న ఒక స్నేహితురాలి కథ విన్నాను.బయటకి ఎంత సంతోషం గ కనిపిస్తున్న ఆమె వెనుక ఎంత బాద దాగి వుంది అన్న నిజం తెలిసాక మనసు ఎంతో బాధగా అనిపించింది.కని ఆమె ఆ నిజాన్ని అలానే ఉంచుతుంది,ఎందుకంటే తన బిడ్డ ఈ లోకం కోసం.అన్ని బరిస్తూ వుంటుంది.
Friday, 25 May 2012
ఎండ తో హోరెత్తుతున్న లండన్
ఇది లండన్ ఏ నా అనిపిస్తుంది.రెండు రోజుల నుండి ఎండ చూస్తుంటే.ఎన్నో రోజుల నుండి ఆ మబ్బుల వాతావరణం నుండి బయట పడాలి అనిపించింది.ఇన్నాళ్ళకు కుదిరింది.చూడాలి ఎన్ని రోజులు ఇలా వుంటుందో.
మొతానికి పార్కులో ఎక్కడ చూసినా జనం ఎండ లో శరీరాన్ని ఆరబెట్టు కుంటున్నారు.
చూడడానికి కాస్త ఇబ్బంది గ వుంది.కాని ఏమి చేస్తాం.ఇక్కడ వాళ్లకు సూర్యుడు కనిపిస్తే పండగే మరి.
Wednesday, 23 May 2012
లండన్ లొ హరే క్రిష్ణ
మొన్న శనివారం రొజు ఇక్కడ లండన్ లొ షాపింగ్ కొసం వెళ్ళాను.అక్కడ హరే క్రిష్ణ సంస్థానం వాళ్ళు భజనలు చేస్తున్నరు.అది
చూస్తుంటె అలానె భజనలొ మునిగిపొయాను.ఇంగ్లిషు వాళ్ళు అలా మై మరచి పొయి గానం చేస్తున్నరు.ఈ ఫొటొలు చుడండి.
Thursday, 17 May 2012
హమ్మయ్య లండన్
హమ్మయ్య చివరికి లండన్ లొ ఎండని చూసాము.మొన్న వారాంతం బాగ అనిపించింది.చాలా రొజుల తరువాత కదా ఎండ సొ ఇంక బట్టల మీద పడ్డాను.హాయిగ బట్టలు ఎండ లొ ఆరెస్తే ఆ ఆనందమె వేరు.ఇంక ఆదివారం రోజు "సెంట్రల్ లండన్" లొ శ్రీ శ్రీ రవి శంకర్ సత్సంగ్ వుంది అంటె వెళ్ళాము.బాగానె వుంది.కాసేపు బజన కాసేపు చర్చ .పర్వాలేదు అనిపించింది.ధ్యానమె కాని కాస్త నవ్వుతు కాస్త సందడిగ అంతె.
Friday, 11 May 2012
లండన్ లొ ఎండ
చాల రోజుల తరువాత లండన్ లొ మళ్ళి ఎండ చూస్తున్నాము.అసలు ఇది మే నెల లాగ లేదు కదా.ఎంత బాగుండెనొ గత సంవత్సరం.చూడాలి ఈ వారంతం ఎలా వుంటుందొ.
Subscribe to:
Posts (Atom)





