చాల రోజుల తరువాత మళ్ళీ రాస్తున్నను.అంతా బాగున్నారా.దేవుడి దయ వల్ల అందరు బాగుండాలి.నిన్న "కొత్త బంగారు లోకం" అనే సినిమా చూసాను.అందరూ చాల బాగుందని అంటుంటె సరే చుద్దామని అనిపించింది.ఒక కుటుంబం గురించి మొదలు పెట్టారు బాగుంది.కాని సినిమా ముందుకు వెళ్తున్న కొద్ది చాల డిస్టర్బ్ గా అనిపించింది.మరీ ఇంటెర్ లొ లవ్వు ఏంటంది బాబూ.10త్ క్లాస్స్ అని సినిమా తీసారు తెలుసు.ఇంకా కథలే లెవా మనకు.అసలు ఒక ప్రేమ కథ తప్ప మనకు ఇంకా మరొక కథలు దొరకవా.ఇంటెర్ లొ ప్రేమ అని తరగతులు హాజరు కాకుండ,పరీక్షలు రాయకుండ అసలు ఆ సినిమా చూస్తుంటే చాలా ఇబ్బంది గా అనిపించింది.ఇంక సమాజం పాడు అవుతుంది అంటె అవదా మరి.ప్రేమ పేరుతొ అసిడ్ పోయడాలు జరుగుతాయి.మంచి చెప్పకపొయినా పరవాలేదు కనీసం చెడు చుపించకుండ వుంటే చాలు అని అనిపించింది.ముందు ముందు చదువు భవిష్యత్తు,కన్న తల్లి తండ్రులు ఇవన్నీ అలొచించరా.అసలు జీవితం అంటే కేవలం ప్రేమెన ఇంకా ఎమీ లేదా.ఇప్పటికె అడదాన్ని ఇష్టం వచ్చినట్టు చూపిస్తున్నారు.ఇంక మరీ చిన్న వయసు అంటె 10త్ ఇంటెర్ లొ ప్రేమ అంటె వాళ్ళ జీవితం ఎటు వెళ్ళలి.చిన్న వయసులొ తప్పు చెయడం అది సినిమా వాళ్ళు చుపించడం చిన్న మనసులొ ఒక ముద్ర లాగ పడిపొతుంది.ఇది ఎంత వరకు కరెక్ట్ అని మీరు అంటారు.దయచేసి మీ అభిప్రాయాలు చెప్పండి.ఎందుకంటె ఇది నా మదిలొ వచ్చిన అలొచన.నేను ఒక్కదానే ఇలా అలొచిస్తున్నాన లేక ఎవరియిన కుడా ఇలాగే అలొచిస్తున్నారా అని తెలుసుకోవాలి అని వుంది.
ఇట్లు
ప్రియ
Wednesday, 30 September 2009
Monday, 25 May 2009
చిన్నారి స్నేహం
మొన్న తెలుగువన్ రేడియో లొ చిన్నారి స్నేహేమా పాట విన్నాను.చాలా రోజుల తరువాత ఆ పాట విన్నాను.చాలా సంతొషం కలిగింది.ఆ పాట ఎవరు రాశారో నాకు తెలియదు కాని అందులోని పల్లవి చరణాలు మనస్సుకి హత్తుకుంటాయి.నిజంగానే గతమయిన జీవితం కథ లాగానే రాసుకొవాలి.ఎందుకంటే అది మళ్ళీ రాదు కాబట్టి.ఎవరిది ఏ దారి అవుతుందొ ఎవరికి తెలియదు.నిజమే.అందుకే కావచ్చు చదువుకునే రోజుల్ని హ్యాపి డేస్ అని అంటారు.
ఇట్లు
ప్రియ
ఇట్లు
ప్రియ
Thursday, 7 May 2009
హెల్లో
నిన్ననే కదండి బ్లాగు ఓపెన్ చేసింది,మళ్ళీ రాయడానికి సమయం దొరకలేదు.ఇదిగో ఇప్పుడే చూస్తున్నా.సరే ఏమి రాయను.
భారత దేశాన్ని వదిలి వచ్చింది ఎక్కడికో తెలుసా మన దేశాన్ని దోచుకొన్న ఆంగ్ల దేశానికి అదేనండి బ్రిటన్ కి.అప్పుడప్పుదు అయ్యో ఈ దేశం లొ వున్నామా అనిపిస్తుంది మనసులొ.ఇక్కడికి వచ్చి నాలుగేళ్ళు అయింది.కాలం చాలా వేగంగా పరుగెత్తుతుంది కదండి.మన దేశం మన రాష్ట్రం లొ పద్ధతులు ఇక్కడి పద్ధతులు చాల భిన్నంగా కనిపించాయి.కొన్ని విచిత్రంగా వింతగా అనిపించాయి కూడా.

Wednesday, 6 May 2009
అందరికి నమస్కారము
సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలె నాట్యము
ఎంత బాగుందో కద పాట.
నేను ఒక తెలుగింటి అమ్మాయిని.పెళ్ళి చేసుకొని విదేశాలకు వచ్చాను.తెలుగులో ఇలా రాస్తున్నందుకు చాల సంతోషంగా వుంది
ఇట్లు
ప్రియ
ఎంత బాగుందో కద పాట.
నేను ఒక తెలుగింటి అమ్మాయిని.పెళ్ళి చేసుకొని విదేశాలకు వచ్చాను.తెలుగులో ఇలా రాస్తున్నందుకు చాల సంతోషంగా వుంది
ఇట్లు
ప్రియ
Subscribe to:
Posts (Atom)